AP JAC Amaravati Released Press Note About Outsourcing Employees Issue: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తాజాగా ఏపీ జేఏసీ అమరావతి ప్రెస్ నోట్ విడుదల చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రధాన ఆర్ధికేతర సమస్యలను చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందని.. కానీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఇంకా అపరిస్కృతంగా ఉన్నాయని పేర్కొంది. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించింది. పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ స్టాఫ్, ఔట్‌సోర్సింగ్ లాబ్ అటెండెంట్‌లకు పెంచిన జీతాలు జనవరి వరకూ చెల్లించారని తెలిపింది. అయితే.. ఆర్ధిక శాఖ ఆమోదం లేదని, ఉద్యోగులు చేయని తప్పుకు ఫిబ్రవరి-2023 నుండి తిరిగి పాత జీతాలు చెల్లించడం చాలా దారుణమని మండిపడింది. ప్రభుత్వం స్పష్టంగా మినిమం టైం స్కేల్ వర్తింపచేయమని ఉత్తర్వులు ఇచ్చినా, కేవలం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా తక్కువ వేతనాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Vellampalli Sreenivas: పవన్, అదే జరిగితే నీ పార్టీని మూసేసుకుంటావా.. మాజీ మంత్రి సవాల్
గత సంవత్సరం చెల్లించిన వేతనాలు రికవరీ చేయాలని ట్రెజరీ అధికారులు నిర్ణయిస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి ఆ ప్రెస్‌నోట్‌లో తెలిపింది. తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులు (GO Ms.No.5) ప్రకారం.. ఏరియర్స్‌తో సహా గత సంవ్సరం వలే కొత్త వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ICPS (చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్)లలో పనిచేసే ఉద్యోగులకు.. ప్రధానంగా సోషల్ వర్కర్, ఔట్ రిచ్ వర్కర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆయాలకు చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఉద్యోగులందరికీ వెంటనే వేతనాలు పెంచాల్సిందిగా కోరింది. స్పోర్ట్స్ అథారిటీలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కోచ్‌లకూ అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని.. వారికి కూడా MTS అమలు చేయాలని కోరుతోంది. రెవెన్యూ శాఖలో వాచ్ & వార్డ్‌గా శ్రీకాకుళం, అనంతపురం, కృష్ణా, కర్నూల్ జిల్లాలలో పనిచేస్తున్న వందలాది మందికి గత రెండు సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదని పేర్కొంది. వైద్య ఆరోగ్య శాఖ బోధనాసుపత్రులలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గత సంవత్సరం అక్టోబర్ – 2022లో నియమించబడిన రోజు నుండి నేటికీ జీతాలు ఇవ్వడం లేదని వెల్లడించింది.
Minister Venugopala Krishna: పవన్‌కి మంత్రి వేణు స్ట్రాంగ్ కౌంటర్.. బాబు ట్రాప్‌లో..