Telangana : పంచాయతీ రాజ్ ఉద్యోగులకు భారీ ఊరట.. పెండింగ్ జీతాలు విడుదల
- పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఊరట
- 12,055 ఉద్యోగుల సేవలను మరో ఏడాది పొడిగించిన ప్రభుత్వం
- వచ్చే ఏడాది మార్చి 31 వరకు వారి సేవలను పొడగిస్తూ జీవో జారీ
- జీవో జారీతో వారి మూడు నెలల పెండింగ్ జీతాల ప్రాసెసింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలందిస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వారి సేవలను పొడిగిస్తూ అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది.
Pawan Kalyan: వీరమల్లును బాయ్ కట్ చేసుకోమనండి
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
సేవల పొడిగింపు జరగకపోవడంతో గత మూడు నెలలుగా ఈ ఉద్యోగుల జీతాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. దీనితో వేతనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పుడు జీవో జారీ కావడంతో వారి మూడు నెలల పెండింగ్ జీతాల ప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆర్థిక శాఖ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు నిధులు కూడా చేరాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంతో, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాలు నేడో, రేపో ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిర్ణయం వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించడంతో పాటు, వారికి పెద్ద ఊరట కల్పించింది. ప్రభుత్వ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగుల సేవలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
CM Revanth Reddy : అగ్రవర్ణాలను కూర్చోబెట్టి మాట్లాడాం.. కాంగ్రెస్ ఉంటేనే అన్నీ ఉంటాయి
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!