తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీల కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు సర్వీసును రెన్యువల్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. 31 మే 2022 వరకు 1,217 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ లెక్చరర్ల సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే వీరిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లెక్చరర్ల గడువు డిసెంబర్‌తో ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ విధంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ నిర్ణయం పట్ల ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.