మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. “సేవాలాల్ జయంతి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ప్రకటించారు.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత బిఆర్ఎస్ పార్టీది.. బంజారా భవన్ ఏర్పాటు చేశారు, తండాలను గ్రామపంచాతీలుగా ఏర్పాటు, మంచినీటి సరఫరా ఏర్పాటు.. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ, యువతులకు స్కూటీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రేవంత్…
Kiren Rijiju: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు-2025, ది ముస్లమాన్ వక్ఫ్ రద్దు బిల్లు-2025 రెండు బిల్లులను పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టారు.
ఎట్టకేలకు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు.
Jagadish Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.
Jupally Krishna Rao: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోలేదు అని తేల్చి చెప్పారు.
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ముందుగా లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సహా కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి.
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ఎన్డీయేకు లోక్సభ, రాజ్యసభల్లో ఎంపీల బలం ఉండటంతో బిల్లు సులభంగానే పాస్ అవుతుంది. అయితే, బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, కేరళలోని ప్రముఖ కాథలిక్ చర్చి నడిపే దినపత్రిక వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఆర్టికల్ ప్రచురించింది. ఈ బిల్లుని ‘‘లౌకికవాదానికి కీలకమైన పరీక్ష’’గా అభివర్ణించింది. దీనిని వ్యతిరేకిస్తే మతపరమైన మౌలిక వాదాన్ని ఆమోదించినట్లు అవుతుందని…
Waqf Bill: ప్రతిష్టాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ రేపు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం ముందుగా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి, చర్చించనున్నారు. ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఎంఐఎం వంటి ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
Harish Rao : రైతు భరోసా అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాట తప్పడం, రైతులను మోసం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. జనవరి 26న రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను…
Addanki Dayakar : ఎటువంటి పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నష్టం కలిగించే ప్రయత్నం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోరని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పక్కన ఉన్న సర్వే నెంబర్ 25లో గల 400 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో పోరాటం చేసి సాధించారని అద్దంకి దయాకర్ తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ, న్యాయపరమైన మార్గంలోనే భూమిని రాబట్టేందుకు కాంగ్రెస్…