ఇన్నాళ్లు ఆ పదవులు చేసిన వాళ్ళు.. పెదవి విరిచారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కానీ…మనకు ఏముంది అని ఫీలింగ్. కానీ ఇప్పుడు ఆ పదవి కీలకం కాబోతుంది. అందుకే ఆశావహులు కూడా భారీ పెరుగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ పదవులు కీలకమే. అది ఏఐసీసీ నుంచి వచ్చిన నాయకులే కీలకం…అన్నట్టు ఉంటుంది. Aicc కార్యదర్శులు… ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీలకు ఉన్న పవర్ ఎవరికి ఉండదు. అందుకే పార్టీలో ఎఐసిసి నేతలకు బాగా పలుకుబడి ఉంటుంది. ఐతే ఎఐసిసి ఇటీవల తీసుకున్న నిర్ణయాలు చూస్తే డీసీసీ అధ్యక్షులను మరింత బలోపేతం చేయడం…పార్టీ తరుపున అన్ని అధికారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై డీసీసీ అధ్యక్షులే అభ్యర్ధులను ఎంపిక చేస్తారని స్పష్టం చేసింది ఎఐసిసి. సీడబ్ల్యూసీలోనూ ఇదే నిర్ణయం తీసుకుంది. ఎఐసిసి సమావేశాల్లో రాహుల్ గాంధీ…ఖర్గే ఇదే ప్రకటన చేశారు. దీంతో ఇక పార్టీ నిర్మాణంపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతుంది అనే ఇండికేషన్ ఇచ్చారు.
ఐతే… కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడు మన వాడు అయ్యి ఉంటే చాలు అనే వ్యవహారమే ఎక్కువ. బలమైన డీసీసీలు కూడా టికెట్లు సాధించుకోలేరు. టికెట్ల ఇప్పించకోలేరు. పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనే ఉండేది కాదు. నడిపించుకున్న వారిది..నడిపించుకున్నాంత అనేలా ఉండేది. ప్రస్తుతం అభ్యర్ధుల ఎంపిక…పార్టీ నిర్మాణంలో డీసీసీలే కీలకమని చెప్పడంతో ఇప్పుడు తెలంగాణలో డీసీసీ అధ్యక్షులకు డిమాండ్ పెరిగింది. తెలంగాణలో పిసిసి చీఫ్‌ని నియమించారు. కమిటీతో పాటు డిసిసి అధ్యక్షుల నియామకం మర్చిపోయారు. అధికారంలో ఉన్న పార్టీ కనీసం పార్టీ కమిటీలు కూడా వేసుకోలేక పోతుందా..? అనే చర్చ వరకు వెళ్ళింది. ఐతే పిసిసినే…కొత్త డీసీసీలను నియమించాల్సి ఉంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి టికెట్ రాని వాళ్లు ఇప్పుడు జిల్లా అధ్యక్ష రేసులోకి వస్తున్నారు. అధికార పార్టీ…దానికి తోడు వచ్చే ఎన్నికల్లో కీలక బాధ్యతలు కూడా ఇస్తుండటంతో డీసీసీలకు డిమాండ్ పెరిగింది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉంది. ఖమ్మం లాంటి జిల్లాలో కూడా పోటీ తీవ్రంగా పెరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉన్న నేతలు…తన సొంత వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించుకునే పనిలో ఉన్నారు. కొత్త ఇంచార్జి వచ్చినా పార్టీలో పదవుల భర్తీ లేదు. దీనికి తోడు ఆలస్యం అయినా కొద్ది పోటీ పెరుగుతుంది.