National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులు స్వాధీనం.. రాహుల్, సోనియా గాంధీలకు ఈడీ షాక్..
- నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ షాక్..
- కీలక ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్న ఈడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చేసుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. వీరిద్దరికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఏప్రిల్ 11న, ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ నోటీసులు జారీ చేుసింది. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్‌కి చెందిన ఈ ఆస్తుల్ని రాహుల్, సోనియా గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయబడ్డాయి.
నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను పబ్లిష్ చేసిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్‌ని యంగ్ ఇండియన్ లిమిటెడ్ కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, నిధుల దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలకు సంబంధించింది ఈ కేసు. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి.. రూ. 2000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని నియంత్రించడానికి యంగ్ ఇండియన్ లిమిటెడ్, అసోసియేట్ జర్నల్ ఆస్తుల్ని దుర్మార్గపు పద్ధతిలో స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: UK YouTuber: బ్రిటీష్.. భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. యూకే యూట్యూబర్ ఎందుకు ఇలా అన్నాడు?
కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)పై జరిగిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తుల స్వాధీనం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఐటీఓలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆస్తిని, లక్నోలోని బిశేశ్వర్ నాథ్ రోడ్‌లోని ఏజేఎల్ భవనాన్ని ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు అందించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని సెక్షన్ (8),రూల్ 5(1) కింద ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈడీ ప్రకారం, అటాచ్ చేయబడిన AJL ఆస్తులు, రూ. 988 కోట్లు నేరంలో మనీలాండరింగ్ చేసినట్లు దర్యాప్తు వెల్లడించింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మెజారిటీ వాటాలు ఉన్నాయి. వీరికి ఒక్కొక్కరికి 38 శాతం వాటాల ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!