జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్లో నా పలుకుబడి గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలి అంటున్నాడు.. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది, సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాను..
Also Read:Priya Varrier : అజిత్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు
10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 36మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బిఆర్ఎస్ లో చేరారు.. ఈ విషయం రాజేశ్వర్ రెడ్డికి తెలియదా.. వేరే పార్టీలో గెలుచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కదా.. పార్టీ ఫిరయింపులను ప్రోత్సహించిందే బీఆరఎస్ పార్టీ.. మీకు ఒక చట్టం వేరేవాళ్లకు ఒక చట్టమా.. నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు.. డాక్టర్ కడియం కావ్య కు బీ ఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చామని అంటున్నారు.. ఇది నిజమని నిరూపిస్తే మా పదవులకు రాజినామా చేయడానికి మేము సిద్ధం.. నిరూపించలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా..
Also Read:Preity Zinta: కొండంత బలమివ్వు స్వామి.. తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రీతి జింటా..
మీ ఇద్దరి మూతులు పగిలే విధంగా భారీ మెజారితో గెలిచి చూపించాం.. నియోజకవర్గ అభివృద్ధికి 800కోట్లు కాదు కదా 8పైసలు కూడా తెలీదు అంటున్నారు.. మళ్ళీ మరుసటి రోజే ఇవన్నీ మేము గతంలోనే తేవాలని అనుకున్నాం కానీ కడియం శ్రీహరే అడ్డుకున్నాడు అంటున్నారు.. ఇంతకన్నా సిగ్గు లేని మాటలు ఏమైనా ఉంటాయా.. చెప్పడానికైనా సిగ్గు అనిపించాలి.. 800కోట్ల అభివృద్ధి పనుల వివరాలను మీడియా ముందు ఉంచాను.. ఆ పనులకు సంబందించిన జీవోలు మీ ముందు ఉన్నాయి.. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు..
Also Read:Preity Zinta: కొండంత బలమివ్వు స్వామి.. తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రీతి జింటా..
కడియం శ్రీహరి, కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు దేవునూర్ గుట్టలలో 2వేల ఎకరాలను ఆక్రమించుకున్నాడు అన్నారు.. రెండు రోజులు బినామీ పేర్లతో 50ఎకరాలు పట్టా చేయించుకున్నాడు అన్నారు.. దేవునూర్ అటవీ భూములలో ఒక గుంట భూమి కబ్జా చేసిన, నా రాజకీయ జీవితంలో ఒక ఎకరం బినామీ పేరుతొ పట్టా చేయించినట్లు నిరూపిస్తే నీ ఇంట్లో గులాం గిరి చేస్తా.. లేకపోతే నువ్వు నా ఇంట్లో గులాంగిరి చేయాలి.. దీనిపై ఆ వెధవ ఇంతవరకు స్పందించలేదు.. చీము నెత్తురు ఉంటే నా సవాల్ ను స్వీకరించాలి.. నేను బొచ్చు కుక్కను కాదు కాపలా కుక్కను అంటున్నాడు.. ఏదైనా కుక్క కుక్కే కదా.. ఇప్పుడు ఈ బొచ్చు కుక్క కొన్ని పిచ్చి కుక్కలను తయారు చేశాడు..
Also Read:Iran-US: దిగొచ్చిన ఇరాన్.. అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు
ఆ పిచ్చి కుక్కలతో సోషల్ మీడియా లో దుర్మార్గమైన పోస్టులు పెట్టిస్తున్నాడు.. నా తల్లిపై పోస్టులు పెడుతున్నారు, నీకు తల్లి ఉంది.. ఎవ్వరిని వదిలి పెట్టను.. నువ్వు పెట్టించిన పోస్టులకు ముందు నా పేరు బదులు నీ పేరు పెట్టుకొని చదువుకో అప్పుడు తెలుస్తుంది.. నేను ఒక్క రూపాయి కాంట్రాక్టు కేసీఆర్ దగ్గర తీసుకున్నానా.. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్నావ్.. దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడదాం.. నా ఎజెండా అంతా నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తా.. ప్రజల ప్రేమనే నా ఆస్తి.. నీలాగా నేను హైదరాబాద్ లో ఉంటూ గెస్ట్ లాగా వచ్చి పోను.. ఇప్పటికైనా నిరూపించలేకపోతే నువ్వు ఒక వెధవవని నిన్ను వదిలేస్తానంటూ కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు గుప్పించారు.