Waqf Act: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపే క్రమంలో, నిరసనల్లో హింసను ప్రేరేపించడానికి ప్రయత్నించాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌర్పొరేటర్. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ హింసను ప్రేరేపిస్తూ చేసిన వీడియో వైరల్‌గా మారింది. చట్టానికి వ్యతిరేకం యువత వీధుల్లోకి రావాలని, ప్రజా ఆస్తులు ధ్వంసం చేయాలని, ప్రాణాలు త్యాగం చేయాలని అతను వీడియోలో పేర్కొన్నాడు.
వీడియోలో కబీర్ ఖాన్ ‘‘బస్సులు, రైళ్లకు నిప్పు పెట్టడి. కొంతమంది ప్రాణ త్యాగాలు చేయనివ్వండి. ప్రతి పట్టనంలో 8-1 మంది మరణించాలి’’ అని చెప్పారు. పోస్టర్లు, పిటిషన్లు సాయం చేయవని, విధ్వంసం మాత్రమే చేస్తుందని ఆయన అన్నారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ క్లిప్ ఏప్రిల్ 08న ఆన్‌లైన్‌లో షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Perni Nani: ఎన్టీఆర్‌లా అభిమన్యుడు కాదు.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారు..!
పోలీసులు కబీర్ ఖాన్‌పై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో హింసను ప్రేరేపించడం, మతసామరస్యాన్ని దెబ్బతీయడం వంటి అభియోగాలు ఉన్నాయి. దావణగెరె పోలీసులు..‘‘ఈ ప్రసంగం సమాజంలో శాంతికి భంగం కలిగించింది, హింస, ద్వేషం మరియు శత్రుత్వాన్ని ప్రోత్సహించింది, శాంతిభద్రతలకు ముప్పు కలిగించింది’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దావణగెరే నగరంలో వార్డ్ నంబర్ 4 నుంచి మాజీ కార్పొరేటర్ అయిన కబీర్ ఖాన్ ఇప్పుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. వీడియో బయటకు రాగానే స్విచ్ ఆఫ్ చేసినట్లు అధికారులు చెప్పారు. అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఈ వీడియోలో విధ్వంసకర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ 50-100 కేసులు నమోదవ్వాలని. తలలు పగలగొట్టాలి. బస్సులు, రైళ్లు తగులబెట్టాలి. ఈ ఆందోళనలు ఆకస్మికంగా జరగకూడదు. జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. మీరు చేయాల్సింది చేయండి. వక్ఫ్ మీతో నిలుస్తుంది’’ అని కబీర్ ఖాన్ వీడియోలో హింసను ప్రేరేపించాడు.