Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా వాణిలో చిన్నారులు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలని అధికారులకు విన్న విన్నవించారు. ఇన్ని రోజుల పాటు కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని పోలీసులు, అధికారులు కాపాడారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు మాట్లాడుతూ.. మూసాపేట మొత్తంలో పిల్లలు ఆడుకోవడానికి ఒక్క పార్కు కూడా లేదు అని తెలిపారు.
Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
అయితే, ఆంజనేయ నగర్ లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు అని ఆ చిన్నారులు తెలిపారు. అధికారులు, పోలీసులు కలిపి పార్కు స్థలాన్ని కాపాడారు.. ఆ స్థలంలో పార్కు డెవలప్ చేసేందుకు గతంలో 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు.. డబ్బులు రిలీజ్ చేయకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి.. అధికారులు డబ్బులిస్తే పార్కు నిర్మాణం అవుతుంది అన్నారు. మేమంతా ఫ్రెండ్స్ తో కలిసి పార్కులో ఆడుకోవచ్చు అని ప్రజావాణిలో చిన్నారులు చెప్పుకొచ్చారు.