Nishikant Dubey: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇటీవల కాంగ్రెస్ ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటును, అమెరికాను లెక్కచేయని తెగువను ప్రశంసించింది. అయితే, తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. భారతదేశం 1968లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకరించిందని, దీని ఫలితంగా 1965 భారత్-పాక్ యుద్ధంలో గెలిచినప్పటికీ, రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు అప్పగించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం విమర్శించారు.
యునైటెడ్ నేషన్ ట్రిబ్యునల్‌లో యుగోస్లేవియాకు చెందిన అలెస్ బెబ్లర్‌ను కాంగ్రెస్ తన ప్రతినిధిగా అంగీకరించిందని, ఆ ట్రిబ్యునల్ భారతదేశానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, ఫలితంగా ఆ భూభాగాన్ని కోల్పోయిందని పేర్కొంటూ దుబే ‘‘ఎక్స్’’లో పోస్ట్ చేశారు.
Read Also: Palnadu District: టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు.. ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య..
నిషికాంత్ దూబే తన పోస్ట్‌లో ‘‘ఈరోజు కథ చాలా బాధాకరమైనది. కాంగ్రెస్ 1965 యుద్ధంలో గెలిచిన తర్వాత, పార్టీ గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 1968లో పాకిస్తాన్‌కు ఇచ్చింది. మనం భారతదేశం-పాకిస్తాన్ సమస్యను అంతర్జాతీయ వేదికకు తీసుకువచ్చాము, యుగోస్లేవియా న్యాయవాది అలీ బాబర్‌ను మధ్యవర్తిగా నియమించాము.” అని రాసుకొచ్చారు. ‘‘మొత్తం పార్లమెంట్ ఆ సమయంలో దీనిని వ్యతిరేకించింది. కానీ ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, ఆమె భయంతో మన వాటాను వేలం వేసింది. ఇది ఉక్కు మహిళ యొక్క నిజం. కాంగ్రెస్ ఎల్లప్పుడు పాకిస్తాన్‌తో ఉంటుంది’’ అని ఆరోపించారు.
పాకిస్తాన్ తో ఘర్షణలో సీజ్ ఫైర్ తర్వాత ప్రధాని మోడీ అమెరికా ఒత్తిడికి తలొగ్గారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. భారత్ ఇందిరా గాంధీని మిస్ అవుతుందనే పోస్టర్లతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. అయితే, దీనికి బీజేపీ నేత దూబే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, జైశంకర్‌పై చేసిన ఆరోపణలప కూడా దూబే స్పందించారు. ‘‘రాహుల్ గాంధీ జీ, ఇది మీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఒప్పందం. 1991లో, మీ కాంగ్రెస్ మద్దతుగల ప్రభుత్వం భారతదేశం, పాకిస్తాన్ ఏదైనా దాడి లేదా సైనిక కదలిక గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయని ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం దేశద్రోహమా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాకిస్తాన్ ఓటు బ్యాంకుతో చేతులు కలిపిందని ఆరోపించారు.
आज की कहानी बहुत ही दर्दनाक है @INCIndia पार्टी ने 1965 का युद्ध जीतने के बाद गुजरात के रन ऑफ कच्छ का 828 SQ किलोमीटर पाकिस्तान को 1968 में दे दिया ।भारत पाकिस्तान के मुद्दे को अंतरराष्ट्रीय मंच पर लाए, मध्यस्थ बनाया,यूगोस्लाविया के वकील अली बाबर को हमने नियुक्त किया ।पूरी संसद… pic.twitter.com/htWRsvHj2C
— Dr Nishikant Dubey (@nishikant_dubey) May 23, 2025