తెలంగాణ కాంగ్రెస్ పాదయాత్రల బాట పడుతోంది. పెరిగిన ధరలే అస్త్రాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనంలోకి వెళ్తోంది. మరోవైపు…భూ సంస్కరణలపై ఒక రోజు పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు రాహుల్ గాంధీ. నిత్యవసర ధరల పెరుగుదలపై ఏఐసీసీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పాద యాత్రలు చేపట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో… తెలంగాణ పిసిసి ఆందోళన బాట పట్టింది. పిసిసి చీఫ్ రేవంత్ చేవెళ్ల నుండి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జాతీయ…
రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కొన్ని సందర్భాల్లో నోరు జారీ.. తమ తప్పును గ్రహించి క్షమాపణలు కోరిన సందర్భాలు చాలానే ఉంటాయి.. తాజాగా, కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్కు ఈ పరిస్థితి ఎదురైంది.. బుధవారం కర్ణాటక అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, దానికి స్పీకర్ అనుమతించలేదు.. ఈ సమయంలో స్పీకర్ను ఉద్దేశించి కాంగ్రెస్ సభ్యుడు, మాజీ స్పీకర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఒక సామేతను చెప్పుకొచ్చారు.. ‘ఒక సామెత…
బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీలను మోడీ సర్కార్ మోసం చేయాలని చూస్తోందన్నారు. దేశజనాభాలో బీసీలే అధికమైనప్పుడు వారి జనగణన ఎందుకు చేయరంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: గంటలో పెళ్లి.. కట్న కానుకలతో వరుడు పరార్ ఈ సందర్భంగా దీనిపై ట్వీట్ చేస్తూ……
తెలంగాణ కాంగ్రెస్లో ఆయన ఎక్స్ట్రా ప్లేయరేనా? పదవి ఇవ్వాలి కాబట్టి.. ఇచ్చారా..? దీనివల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలేంటి? కేడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? యూపీ కోటాలో.. ప్రియాంకా సిఫారసుతో తెలంగాణలో పదవి? తెలంగాణ కాంగ్రెస్లో ఎవరికీ పదవి గ్యారెంటీ లేకున్నా.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్కు పక్కా. సొంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటో తెలియదు కానీ.. మరో రాష్ట్రంలో కోటాలో ఆయనకు ఇక్కడ పదవి ఖాయం. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉత్తరప్రదేశ్ కోటా.. ప్రియాంకా గాంధీ…
గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ జిల్లాలో కాంగ్రెస్కు బలగం ఉంది. అలాంటిది బరిలో ఉండకుండా కాడి పడేశారు. రాజకీయంగా ఎత్తులు.. జిత్తులు వేయగలిగిన వాళ్లు ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీ నేతలపైనే సొంతవాళ్లు ఆరోపణలు చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? వ్యూహం లేదు.. కాడి పడేశారు..! స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అధికారం డీసీసీలకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్. బలం లేకున్నా బరిలో నిలుచుని.. సమస్యలపై చర్చకు పెట్టాలని మెదక్, ఖమ్మం జిల్లాలో పోటీ చేసింది.…
కాంగ్రెస్ పోటీ చేసిన రెండు స్థానాల్లో మాకు ఉన్న ఓట్ల కంటె ఎక్కువే వచ్చాయి. కాబట్టి భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి విజయం సాధించారు అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ ఓట్లు మాకు వచ్చాయి అంటే.. టీఆర్ఎస్ పై వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా..నైతికంగా ఓడిపోయింది. నల్గొండలో అభ్యర్థిని పెట్టకపోయినా..ఇండిపెండెంట్ అభ్యర్థికి మా పార్టీ వారు ఓటేసారు. స్థానిక సంస్థల పట్ల టీఆర్ఎస్ వ్యతిరేక దోరణి..…
నల్గొండ స్వత్రంత అభ్యర్థి నగేష్ ఎంపీ కోమటిరెడ్డిపై సంచలన కామెంట్లు చేసారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు స్వత్రంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నాం. నేను కాంగ్రెస్ కి చెందిన జెడ్పీటీసీని… అయినా నాకు ఓటు వెయ్యవద్దని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఓటర్లకు చెప్పారు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కి సపోర్ట్ చేశారు. ఆయన వల్లే…
ఎన్నికల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వ సాధారణమైన విషయం.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తన పంతం నెగ్గించుకున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గతంలో సవాల్ చేసిన ఆయన.. ఈ రోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు రావడంతో తన పంతం నెగ్గించుకున్నారు.. జగ్గారెడ్డి…
టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ముందు కాంగ్రెస్ కుట్రలు ఓడిపోయాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కోటిరెడ్డికి పార్టీలకతీతంగా మద్దతు తెలిపి మెజార్టీ ఇచ్చి గెలిపించారన్నారు. తక్కువ ఓట్లు ఉన్న జిల్లాలో పోటీ చేసిన…
తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల గణనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల కులగణన చేస్తామని, బీసీల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక బీజేపీ బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీసీల లెక్కలను తీయడంలో…