తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 5 నియోజకవర్గాలలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను ఏజెంట్ల మధ్య తెరుస్తారని ఆయన తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.…
రెండు రోజుల తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ప్రస్తుతం 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే నిబంధనలు ఉల్లంఘించినందుకు 12 మంది విపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ .. తమ…
రాష్ట్రంలో ధాన్యం సేకరణ కొనసాగుతుందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై ఫైర్ అయ్యారు. సిగ్గులేకుండా బీజేపీ నేతలు గవర్నర్ను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపారన్నారు. మొహం మీద కొట్టినట్టు అంత బాగుంది అని రైతులు వారికి సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. 5,447 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించి …రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశామని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.…
కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, హిందువాదిని కాదని అన్నారు. జైపూర్లో మెహంగాయ్ హటావో మహార్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందు, హిందూత్వ అనే రెండు పదాల మధ్య దేశ రాజకీయాల్లో ఘర్షణ జరుగుతున్నదని రెండింటి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. హిందువు అంటే సత్యం అని, సత్యం కోసం శోధించేవాడని, సత్యాగ్రహం అని, హిందుత్వ అంటే అధికారం…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు చేశారు. నేడు రాజస్థాన్లోని జైపూర్లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ.. బీజేపీ ప్రభుత్వం వ్యాపారుల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డిజీల్, గ్యాస్, వంట నూనె ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజల సంక్షేమాల గురించి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయంలో…
హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమికి కారణాలు అన్వేషిస్తూ కాంగ్రెస్ వేసిన కమిటీ ఏమైంది..? ఆ నియోజకవర్గంలో కమిటీ పర్యటన లేనట్టేనా..? నాయకులతో మాట్లాడి తూతూ మంత్రంగానే ముగించేయాలని నిర్ణయించారా..? హుజురాబాద్ ఓటమిపై కమిటీ వేసి 3 వారాలైంది..! హుజురాబాద్ ఉపఎన్నికలో తమ అభ్యర్థికి 3 వేల ఓట్లే రావడంపై తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద దుమారమే లేపింది. పార్టీలో సీనియర్ నాయకులు.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేశారు. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్.. పూర్తిగా ఈటలకు…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. కాంగ్రెస్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష కూటమి.. కాంగ్రెస్ లేకపోయినా ఏర్పాటు చేయవచ్చని కామెంట్ చేశారు. 1984 తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదని .. గత పదేళ్లల్లో కాంగ్రెస్ 90 శాతం వైఫల్యాల్నే చూసిందన్నారు ప్రశాంత్ కిషోర్. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతేనే కాంగ్రెస్ పరిస్తితిలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు . 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయిందని…
గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాజీనామాల పర్వానికి తెరలేచింది. పార్టీ పదవుల పంపకం, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై అసంతృప్తి నేతల్ని పార్టీ వీడేలా చేసింది. ప్రియాంకా గాంధీ పర్యటన సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వరుసగా పదేళ్ల UPA పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ మసకబారిపోయింది. క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతోంది. అయితే, పార్టీకి మళ్లీ జవసత్వాలు ఊదడానికి ప్రయత్నిస్తున్నారు ప్రియాంక గాంధీ. వచ్చే ఏడాది…
మెదక్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ కి ఏకగ్రీవం కావొద్దనే కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాము అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థిని పెట్టాము. మాకు 230 ఓట్లు ఉన్నాయి. .మేము గెలిచే అవకాశం లేదు. కానీ మా ఓట్లు మేము వేసుకోవాలని అనుకున్నాం. మేము అభ్యర్థి ని ప్రకటించగానే హరీష్ రావు ఉలిక్కి పడ్డారు. క్యాంప్ లు పెట్టాల్సింది మేము… కానీ టీఆర్ఎస్ వాళ్ళు భయంతో క్యాంప్ లు…