సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ రెడ్డి వరంగల్‌లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని కోసం ఉదయం ఆయన సిద్ధంకాగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గత సోమవారం కూడా రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి చేపట్టారు. కానీ ఒమిక్రాన్ వ్యాప్తి, కోవిడ్ నిబంధనలు ఉన్నందున రేవంత్‌రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది.