టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్ చరిత్రను రూపు మాపలేరని, దేశానికి మంచి రోజులు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. అంతేకాకుండా సోనియా గాంధీ నాయకత్వంలోనే దేశానికి రక్షణ కలుగుతుందని ఆయన అన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను భూస్థాపితం చేయాల్సిన బాధ్యత గాంధేయ వాదులపై ఉందన్నారు. పార్లమెంట్ లో 80 మంది కంటే ఎక్కువ మహిళలు లేరని, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది ఆడ బిడ్డల అభిప్రాయం తీసుకోవాలి కానీ హాడా హుడి నిర్ణయం సరికాదని ఆయన హితవు పలికారు. దేశానికి మోడీ, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం ప్రమాదకరమని ఆయన విమర్శించారు. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో ముందుకు వెళ్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు.