తెలంగాణ కాంగ్రెస్ .. ఏపీ కాంగ్రెస్‌కి అప్పు పడిందా..!? పాత బకాయిని వసూలు చేసుకునే పనిలో ఏపీ నేతలు ఉన్నారా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీసీసీకి ఆ మొత్తం ఇప్పుడు చాలా అంటే చాలా అవసరమా? ఇంతకీ టీపీసీసీ చెల్లించాల్సిన అప్పు ఎంత? టీపీసీసీ, ఏపీసీసీ మధ్య అప్పుపై కాంగ్రెస్‌లో చర్చ..! తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల మధ్య ప్రస్తుతం అప్పు పంచాయితీ నడుస్తోంది. అదీ 2014 నుంచీ వసూలు కాకుండా ఉండిపోయిన అప్పుగా చెబుతున్నాయి పార్టీ…
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? బీజేపీ నాయకులను అమిత్ షా అలర్ట్ చేశారంటే ఏదో ఇండికేషన్ ఉండే ఉంటుందా? టీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలను గ్రౌండ్‌లోనే ఉండాలని చెప్పిందా? మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..!? ముందస్తు వేడి మధ్య కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?2018 ముందస్తు ఎన్నికల్లో తేలిపోయిన కాంగ్రెస్ వ్యూహం! తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వాడీ వేడి చర్చ మొదలైంది. ఈ దిశగా రాష్ట్ర బీజేపీ నేతలను అమిత్ షా అప్రమత్తం చేయడంతో ఏం జరుగుతుందా అని అంతా…
తెలంగాణలో ఇంటర్ విద్యార్దులు ఫస్టియర్ విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, కాంగ్రెస్.. ఇతర విద్యార్ధి సంఘాలు ఇంటర్ బోర్డుపై వత్తిడి తెచ్చాయి. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 35 మార్కులతో ఫెయిలైన విద్యార్థులందరినీ… పాస్ చేస్తున్నట్లు తెలిపారు. మినిమమ్ మార్కులు వేసి.. ఈ సారి పాస్ చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నేపథ్యంలో తమ ఉద్యమ ఫలితంగా ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వంలో కదలిక…
కేసీఆర్ ఆయన మంత్రులు చెప్పేదొకటి, చేసేదొకటని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.బీజేపకీ ప్రభుత్వం లక్ష్యాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని మంవడిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు , మంత్రులు ఢిల్లీ వెళ్లి వానాకాలం పంటను కొనుగోలు చేయమని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య యాసంగి పంటదని వాటి పై మాట్లాడకుండా కేసీఆర్ బీజేపీ తో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వారి…
టీఆర్ఎస్ను వీడి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన DS.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పాకే కాంగ్రెస్ కండువా కప్పుకొంటారా? నైతికత కింద రాజీనామా చేస్తారా? ఇంకేదైనా వ్యూహం ఉందా? రాజకీయాల్లో చురుకైన పాత్ర కోసం చూస్తున్నారా? పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో.. కాంగ్రెస్‌లో డీ శ్రీనివాస్ చేరిక త్వరలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమై.. తిరిగి పాత గూటిలోకి వెళ్లేందుకు సమ్మతి తీసేసుకున్నారు. అయితే…
రైతులకు అన్యాయం చేయడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కనీస మద్దతుధర కల్పించడంలో కేంద్రం బాటలోనే రాష్ట్రం పోతోందని విమర్శించిన ఆయన.. కనీస మద్దతు ధర విషయంలో స్పస్టత ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు జీవన్‌రెడ్డి.. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 5 శాతం.. 3 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లే దోపిడీ చేస్తున్నారని..…
ఆ ఇద్దరూ గతంలో ఒకరిపై ఒకరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో రాజకీయం ఓ రేంజ్లో సాగేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ యుద్ధానికి కొంత విరామం వచ్చింది. ఇప్పుడు ఇద్దరూ ఒకే సభలో సభ్యులు. వారి మధ్య పాత పొలిటికల్ వార్ మళ్లీ మొదలవుతుందా? ఇద్దరి మధ్య పాత పొలిటికల్ వార్ కొత్తగా మొదలవుతుందా? ఎల్. రమణ. మొన్నటి వరకు టీడీపీ తెలంగాణ చీఫ్. హుజురాబాద్ ఉపఎన్నిక ముందు సైకిల్ దిగి.. టీఆర్ఎస్…
ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేశారు. సీఎం రేస్ వరకు వెళ్లారు కూడా. సడెన్‌గా పాలిటిక్స్‌కు దూరం. ఆథ్యాత్మిక.. సేవా కార్యక్రమాలకే పరిమితమై.. వాటిని కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారా? పార్టీ మారబోతున్నారా? ఎవరా నాయకుడు? 2019 తర్వాత రాజకీయాలకు దూరం..! రఘువీరారెడ్డి. రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్న వారికి ఈ పేరు.. సుపరిచితమే. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన ఆయన.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరోలేఖ రాశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఈసారి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఇంటర్ విద్యార్థులకు పాస్ మార్కులు వేయాలని కోరిన ఆయన.. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తేవొద్దని.. ఇది రాష్ట్రానికి మంచిది కాదని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడొద్దు అంటూ సీఎం దృష్టికి తీసుకెళ్లిన జగ్గారెడ్డి.. కనీస మార్కులు వేసి అందరినీ పాస్ చేయాలని కోరారు.. ఈ విషయంపై విద్యార్థులు…
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాసటగా నిలిచారు. ట్విట్టర్లో కేటీఆర్‌ను, @TelanganaCMO ను ట్యాగ్ చేస్తు కోమటి రెడ్డి విమర్శలు చేశారు. విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తుపెట్టుకో కేసీఆర్ @TelanganaCMO &@KTRTRS … ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వస్తుంది…వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న మీకు & మీ…