తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎంతో మంది రైతులు పేర్లు మారిపోవడం.. గుంట స్థలం ఉన్నవారికి ఎకరా స్థలంగా నమోదైతే.. ఇక ఎకరాల భూమి ఉన్న రైతు గుంట స్థలానికి యజమానికిగా చూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్‌ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ వ్యవస్థతో ప్రజలుకు మేలు చేకూర్చుతారని అంతా భావిస్తుంటే ధరణిలో తలెత్తుతున్న సమస్యలు తెలంగాణ సర్కార్‌కు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యలతో బాధపడుతున్న రైతుల ఆవేదనను ట్విట్టర్ వేదిక పంచుకున్నారు.
అంతేకాకుండా ఇదే అదునుగా కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అయితే రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో.. ధరణి పోర్టల్ కారణంగా ఏర్పడ్డ కొత్త సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న ప్రజలు చివరకు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పోస్టర్లు అంటించారట. రైతులకు ఇబ్బంది పెట్టే ధరణి సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదు అంటూ సదరు పోస్టర్లలో రైతులు రాశారు. ఈ పోస్టర్లను, రంగారెడ్డి కలెక్టరేట్ నేమ్ బోర్డు కనిపించేలా వీడియో తీసిన రేవంత్ రెడ్డి దానిని ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ఐటీలో బిల్ గేట్స్‌కే గురువునని చెప్పుకునే కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.