Bhatti Vikramarka Padayatra: ప్రగతి భవన్‌ను బద్దలు కొడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)ను ఇవాళ ప్రారంభించారు.. ముదిగొండ మండలం యడవల్లిలో యాత్ర ప్రారంభమైంది.. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకందిద్దారు. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలు, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో యడవెల్లి హోరెత్తింది. ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్కగారి పై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Read Also: Kodali Nani: ‘భీమ్లా నాయక్’ను జగన్ తొక్కేయడమేంటి? జీవో ఇస్తామని చెప్పామా?
Also Read
తన పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు భట్టి విక్రమార్క.. ప్రభుత్వం మెడలు వంచేందుకు ఈ పాద యాత్ర అని ప్రకటించిన ఆయన.. తెలంగాణ తెచ్చుకున్నది సమస్యలు పోవాలని, అందరికి ఇల్లులు, ఉద్యోగాలు వస్తాయని.. కానీ, అది నెరవేరలేదు… సంపద మొత్తం కొద్ది మంది పాలకుల ఇళ్లలోకి వెళ్తుందని.. పేదల సంపద పెరగడం లేదన్నారు. ఒక్క డీఎస్‌ఈ కూడా రిక్రూట్ కాలేదు.. ఏ ఏళ్లు అయినా ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించలేదు.. రోడ్ మీదకు వచ్చి ఆందోళనలు చేయాల్సి వస్తోందన్నారు. 8 ఏళ్లుగా ఇళ్లు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు.. రైతులు రోడ్లపైకి వస్తున్నారు.. దళిత రైతులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? అని ప్రశ్నించిన భట్టి.. ప్రజల సమస్యలు తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రం మీద పోరాటం చేయాల్సిందే.. మనకు కేంద్రం నుంచి రావాల్సినదానికోసం పోరాడాల్సిందే అన్నారు భట్టి… సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకుంటే… నువ్వు, నీ కుటుంబం, నీ అనుచరులు బాగు పడడానికి ఉపయోగపడిందని సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యల గురించి అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని విమర్శించిన ఆయన.. తెలంగాణ అంటే నలుగురు కుటుంబ సభ్యులు కాదు, నలుగురు మంత్రులు కాదన్నారు.. ఇక, పీపుల్స్ మార్చ్‌తో ప్రగతి భవన్‌ను బద్దలు కొడతామని ప్రకటించారు మల్లు భట్టి విక్రమార్క.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!