తెలంగాణ కాంగ్రెస్ లో కుదుపునకు కారణం అయ్యారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పదిహేను రోజుల పాటు తన రాజీనామాకు బ్రేక్ వేసావనన్నారు జగ్గారెడ్డి, సోనియా గాంధీని, రాహుల్ గాంధీ ని కలవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు జగ్గారెడ్డి. ఇదే సమయంలో తాజాగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇక బిజెపిలోకి వెళ్లే మాటే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ గా ఉండాలని భావిస్తున్నట్లుగా జగ్గారెడ్డి పార్టీ కార్యకర్తలతో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడవద్దని కార్యకర్తలు జగ్గారెడ్డిని కోరారు. తనపై వస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ నేతలు కొందరు చేసేవే ఎక్కువగా వున్నాయన్నారు. మార్చి 21 న లక్షమందితో బహిరంగసభకు ప్లాన్ చేశారు. ఈ సభకు సోనియా, రాహుల్ గాంధీని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జగ్గారెడ్డి.
తాను క్లారిటీతోనే వున్నానని.. కార్యకర్తలు కూడా క్లారిటీలోనే వున్నారు. కాంగ్రెస్ పార్టీలో లోపాలు సవరించేందుకు ప్రయత్నాలు చేస్తానన్నారు. కాంగ్రెస్ సేఫ్ జోన్ లోకి రావాలన్నారు. కార్యకర్తలు కోరినట్టుగా తాను పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా..ఇండిపెండెంట్ గా పోటీచేస్తే వారిని వత్తిడి చేయనన్నారు. ఎన్నికల అనంతరం పార్టీ నుంచి బయటకు వెళితే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ సభ సభే. నేను డ్యూటీలోనే వున్నా. కాంగ్రెస్ సభ్యత్వం చేయాలన్నారు. 10వ తేదీన రివ్యూ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో తనకు అనుమానాలున్నాయని, ఆ విషయం మీడియాతో చెప్పలేనన్నారు జగ్గారెడ్డి.