Bhatti Vikramarka: పట్టువదలని భట్టి పాదయాత్రతో వత్తిడి పెంచేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన పట్టు పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి నాయకుడే లేకుండా పోయినప్పటికీ ఉన్న నాయకులు భట్టి విక్రమార్కను ఎదుర్కొనే శక్తి లేకుండా చేయగలిగారు. అయినప్పటికి సంతృప్తి చెందకుండా నియోజకవర్గంలో ఏ మాత్రం తన పట్టు చేజారి పోకుండా చూసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఏ పథకం వర్తింప చేసిన అది తన నియోజకవర్గానికి వచ్చేలా చూసుకుంటారు విక్రమార్క. గత ఎన్నికల్లో భట్టి విక్రమార్కను ఓడించడానికి అధికార పార్టీ గట్టి ప్రయత్నాలే చేసింది. అయినప్పటికీ ఆయన గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారు. అది కూడా హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన భట్టి విక్రమార్క ఆతరువాత మధిర నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎగా పోటీ చేస్తున్నారు. మూడుసార్లు అక్కడ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఆ పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటారు. అదే కోవలో జిల్లాలో ర్యాలీలను చేయడంలో దిట్టగా పేరు పొందారు. గతంలో ట్రాక్టర్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలు, మోటార్ సైకిల్, సైకిళ్ల మీద ర్యాలీలను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ర్యాలీలు ఉపయోగపడతాయని ఆయన అభిలాష.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 32 రోజుల పాటు 506 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ప్రతి మండలంలో 7 రోజుల వరకు ఈ యాత్ర ఉండనుంది. గత కొంత కాలం క్రితం చింతకాని మండలానికి చెందిన మరియమ్మ లాకప్ డెత్ వ్యవహారంలో తాను తీసుకున్న ఉద్యమం వల్ల ఆ కుటుంబానికి ఉద్యోగం రావడమే కాకుండా లాకప్ డెత్ కు బాధ్యులైన వారిని డిస్మిస్ చేయించగలిగారు.అదే విధంగా దళిత బంధు పథకం కూడా ముందు తన నియోజకవర్గాన్ని ఎన్నికయ్యేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకుని వచ్చి చేయించగలిగారు. దీంతో నియోజకవర్గంలో భట్టి విక్రమార్కకు మంచి పట్టు లభించింది. అధికారపార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని పథకాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మళ్లీ పాదయాత్ర పేరుతో ప్రజకు మరింత చేరువయ్యేలా భట్టి విక్రమార్క ఈ యాత్ర ను చేపడుతున్నారు. ముదిగొండ మండలం యడవల్లి గ్రామం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఎర్రుపాలెం మండలం జమలాపురం వద్ద ఈ యాత్ర ముగింపు చేయనున్నారు. యాత్ర ముగింపు సందర్బంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జాతీయ నాయకులను ఆహ్వానించాలని కూడా భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచాలని భట్టి విక్రమార్క భావిస్తున్నారు.
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?