నా రాజకీయ జీవితం ప్రారంభం అయ్యిందే యూత్ కాంగ్రెస్ తో అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ కోటాలో మంత్రిని అయ్యాయని, నాదేమి పెద్ద కుటుంబం కాదన ఆయన అన్నారు. పని చేస్తే ఎమ్మెల్యే లు..మంత్రులు అవుతారని, కష్టపడి పని చేయండి.. రాహుల్ గాంధీ టికెట్స్ కూడా ఇస్తారని ఆయన వెల్లడించారు. ఖాళీ లు వెంటనే పూర్తి చేయాలని, నిరుద్యోగులు రోడ్ల మీదకు రావాలన్నారు. అందరితో కలిసి నడిస్తేనే అధికారంలోకి వస్తామని, యువతతో కలిసిపోరాటం చేయండని ఆయన అన్నారు.
బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు కలిసి పని చేస్తున్నాయన్నారు. అనంతరం మాజీ మంత్రి చిన్నారెడ్డి టీపీసీసీ నాకు అనుమతిస్తే నిరుద్యోగుల కోసం నేను గాంధీ భవన్ లో అమరణనిరాహార దీక్ష చేస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడం లేదని, ఫీజ్ రీయింబర్స్ మెంట్ లేక విద్యార్థులు చనిపోతున్నారని ఆయన మండిపడ్డారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు.