పీసీసీ మాజీ చీఫ్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం ముదిరిపోయింది. 2009లోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ వరకు న్యాయపోరాటం చేసిన నాయకులు వీరిద్దరూ. అలాంటిది పదేళ్ల తర్వాత అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకరికొకరు హస్తం అందించుకుని నేస్తమయ్యారు. ఆ సమయంలో వారి మైత్రీని చూసిన వాళ్లంతా ఇద్దరూ కలిసిపోయారనే అనుకున్నారు. కానీ.. తెలంగాణలో పీసీసీ నిర్వహిస్తున్న రచ్చబండ వీరిమధ్య మరోసారి…
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే బాధ్యత మీదే అంటూ హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనికి నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగితే కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్…
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ విచారణపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంపీలపై అనుచితంగా వ్యవహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంపీలని చూడకుండా లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు, అగ్రనేతలు పి.చిదంబరం, మల్లిఖార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్…
హైద్రాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ముట్టడికి పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. విడతల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్డడికి వచ్చారు. మోదీ కొ హటావ్ దేశ్ కొ బచావ్ అనే నినాదాలతో రాజ్ భవన్ అట్టుడికింది. ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ…
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ విచారణపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంపీలపై అనుచితంగా వ్యవహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంపీలని చూడకుండా లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడుకు చెందిన ఎంపీ జోతిమణి, ఢిల్లీ…
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ ఒకవైపు.. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయపక్షాలు మరోవైపు పావులు కదుపుతున్నాయి. మమతా బెనర్జీ సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న గులాబీ పార్టీ.. హస్తినలో విపక్షాల సమావేశానికి దూరంగా ఉండటం వెనక ఉన్న మతలబుపై చర్చ జరుగుతోంది. ఇందుకు తమ కారణాలు తమకు ఉన్నాయన్నది టీఆర్ఎస్ నేతలు చెప్పేమాట. తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నామన్న సంకేతాలు పంపడంలో…