సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. కాగా ఘట్కేసర్లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని రేవంత్ నిలదీశారు. అరెస్ట్ గురించి రాతపూర్వకంగా పత్రం ఇస్తేనే పోలీస్‌స్టేషన్‌కు వస్తానంటూ రేవంత్…
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్థులే దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయి ఢిపెన్స్ అకాడమీ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొన్నట్లు గుర్తించారు. గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ అభ్యర్థులు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రైలులో సాయి ఢిపెన్స్ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు. Read Also: KCR Press Meet: సాయంత్రం…
సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ స్పందించారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం.. అదే తరహాలో అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ…
పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల బెడద కిందిస్థాయి కార్యకర్తలకు ఇబ్బందులు తెచ్చి పెడుతోందట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెలు జడ్పీటీసీ గంటా రాములు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ వేరు కుంపటి పెట్టేశారు. దీంతో ఎవరి వైపు వెళ్లాలో కాంగ్రెస్ శ్రేణులకు అర్థం కావడం లేదట. రాజకీయంగా విజయ రమణారావు, రాములు ఇద్దరు గురు శిష్యులు. గతంలో టీడీపీ ఉన్నవాళ్లే.…
దేశంలో ‘ అగ్నిపథ్’ స్కీమ్ ప్రకంపనలు రేపుతోంది. ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. బీహార్ లోని పలు జిల్లాల్లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. టైర్లను కాలుస్తూ రైల్వే ట్రాక్స్ పై పడేస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు…
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సిల్లీ అని కొట్టిపారేయటం విస్మయాన్ని కలిగిస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్…
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ఏకగ్రీవ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. కానీ ఆజాదీ కా అమృతోత్సవ్ నేపథ్యంలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకు విపక్షాలనూ ఒప్పించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ చీఫ్…
నేడు తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆందోళన పేరుతో కాంగ్రెస్ విధ్వంసం సృష్టించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించిందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని,…
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. తమ అగ్రనేతలనే లక్ష్యంగా చేసుకుంటారా అంటూ రగిలిపోతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాంగ్రెస్ ఆందోళనలతో దేశమంతా అట్టుడికిపోయింది. రాహుల్ గాంధీ సుదీర్ఘ ఈడీ విచారణ…కొన్ని రోజుల్లో సోనియా గాంధీకి సైతం తప్పని దర్యాప్తు సంస్థల ప్రశ్నలు…ఈ పరిణామాలు, కాంగ్రెస్ నాయకుల్లో ఒక్కసారిగా కదలిక తెచ్చాయా? నిస్తేజంగా వున్న క్యాడర్ లో కదన కుతూహలం పెంచాయా? జాతీయ రాజకీయాల్లో ఎన్నడూలేనంతగా కుదుపు. దేశవ్యాప్తంగా పొలిటికల్ ప్రకంపనల దుమారం. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్…