తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఓవైపు బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటూనే.. మరోవైపు.. నియోజకవర్గంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే దానిపై ఆరా తీస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.. ఇక, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై.. షోకాజ్ నోటీసులు ఇద్దామా? పార్టీ నుంచి సస్పెండ్…
National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడో రోజు విచారించనుంది ఈడీ. ఇప్పటి వరకు రెండు రోజుల పాటు సోనియా గాంధీ విచారణ సాగింది. సుమారు 9 గంటల పాటు సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు సోనియా. సోనియా గాంధీ విచారణ సందర్భంగా నిన్నంతా ప్రియాంకాగాంధీ తోడుగా ఉన్నారు.
MP Rahul Gandhi detained during protest: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈ రోజు మరోసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించనుంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, కీలక నాయకులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈడీ కేసుతో పాటు ధరలపెరుగుదల, జీఎస్టీపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేపట్టారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కాంగ్రెస్ మార్చ్ ను అడ్డుకోవడంతో నేతలు,…
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ మరోసారి చర్చ సాగుతోంది.. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయన.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని పలు సందర్భాల్లో ప్రకటించారు.. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇక, బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి…
ప్రధాని మోడీ తల్లి పాల మీద తప్ప అన్నింటిపై పన్నులు వేశారని.. మోడీ పనుల ప్రధాని కాదు పన్నుల ప్రధాని అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.