MLC Jeevan Reddy: కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడు.. అసెంబ్లీతో బంధం తెగిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడు.. అసెంబ్లీ తో బంధం తెగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల్లోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజగోపాల రెడ్డి రాజీనామాను సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపి, అధికారికంగా స్పీకర్ కార్యాలయం ప్రకటించడంతో ఆయన స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ లో పంచ పాండవులు మిగిలారని, కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడని, సిఎల్పీ నేత ధర్మరాజు, జగ్గారెడ్డి భీముడు, శ్రీధర్ బాబు అర్జునుడు అంటూ ప్రస్తావించారు. రాజగోపాల్ రెడ్డి కి అసెంబ్లీ తో బంధం తెగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. చచ్చిన టీఆర్‌ఎస్ నీ బతికించే పనిలో పడ్డారు రాజగోపాల్ రెడ్డి అంటూ తెలిపారు. టీఆర్‌ఎస్‌కి బలం పెంచుకునే అవకాశం ఇచ్చినట్టు అయ్యింది రాజగోపాల్ రెడ్డి రాజీనామా అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు లో మేము గెలిస్తే అధికారం లోకి వచ్చినట్టే అని, అభ్యర్ధి నీ పీసీసీ నిర్ణయిస్తారని తెలిపారు.
read also: UDAN Scheme: ఉడాన్ పథకం ఘనత. ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలు ప్రారంభం.
Also Read
రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రజలు ఎలా చూస్తారు అనేది చూడాలని అన్నారు. రాజీనామా తో అభివృద్ధి అనేది కరెక్ట్ వ్యూహం కాదని జీవన్ రెడ్డి ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం అంటే చేత కానీ తనం అంటూ విమర్శించారు. అందరూ ప్రెసిడెంట్ కాలేరని ఎద్దేవ చేసారు. మూడేళ్లుగా రాజగోపాల్ రెడ్డి చేసిన ఉద్యమం ఏంటి? , ఎమ్మెల్యే గా ఉద్యమం చేస్తుంటే వద్దని కాంగ్రెస్ అన్నదా..? ప్రశ్నించారు జీవన్ రెడ్డి.
అయితే ఇవాళ ఉదయం ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ ను కలిసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు అందించారు. అయితే ఈ విషయం పై స్పీకర్ కొన్ని నిమిషాల్లోనే ఆమోదించడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. రాజగోపాల రెడ్డి రాజీనామాను సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపి, అధికారికంగా స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారని తెలిపిన విషయం తెలిసిందే.
Banjara Hills: దారుణం.. యువతిని బంధించి సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..