Uttam Kumar Reddy: రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. గిరిజన రిజర్వేషన్లపై వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిరిజనుల రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతం పెంచాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తెలంగాణాలో పోడు భూముల సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా, ఎటువంటి వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుండడం వల్ల గిరిజనులకు, దళితులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు.
read also: Bihar Politics: నితీష్ వలస పక్షి, అధికారం కోసం ఏదైనా చేస్తాడు.. బీజేపీ విమర్శలు
Also Read
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సందర్భంగా రాములునాయక్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన నాయకులు, ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణకు చెందిన గిరిజన నాయకులు కలిశారు. తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతం పెంచాలని గిరిజనులు కోరుతున్నారని గత ఎనిమిదేళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ గిరిజనుల రిజర్వేషన్లు పెంచకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని పార్లమెంట్‌లో చెబుతోందని మండిపడ్డారు.
ఇది తెలంగాణలోని ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, పోడు భూముల సమస్యల పరిష్కారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోరారు. తెలంగాణలోని లక్షలాది మంది గిరిజనులు అనేక దశాబ్దాలుగా క్లియరెన్స్ చేసిన అటవీ ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు వారికి హక్కులు కల్పించాయి. ఇప్పుడు వివిధ సాకులతో తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను తరిమికొట్టేందుకు క్రూరమైన పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. అయితే.. 50 శాతానికి అదనంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Bihar Politics : శివసేన తరహాలో జేడీయూలో చీలికకు బీజేపీ ప్రయత్నించిందా..?
- Tags
- congress
- delegation
- President
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?