Dasoju Sravan Kumar also resigned to Congress Party
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజీనామా పర్వం కొనసాగుతోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌పార్టీతో పాటు.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పార్టీ వీడుతున్నట్లు లేఖ రాశారు. అయితే ఇప్పుడ అనుహ్యంగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. ఈ మేరకు దాసోజు శ్రవణ్ కుమార్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్ పోటీ చేశారు.
అయితే.. పీజేఆర్ కూతరు విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై అసంతృప్తిగా ఉన్న శ్రవణ్ తాజాగా పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌కు దెబ్బమీద దెబ్బ తగిలినట్లువుతోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ లకు కాంగ్రెస్ పార్టీలోని ఈ రాజీనామాలు కలిసివచ్చినట్లువుతున్నాయి. అయితే దాసోజు శ్రవణ్ కుమార్ ఏ పార్టీలో చేరబోతున్నారన్న విషయంపై క్లారిటీ లేదు.