మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు వరదలు ముంచెత్తాయి. దీంతో కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ అయిన పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా.. గతంలో చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. ఎవ్వరైనా సరే ఎంత అడ్డుకున్నా ఏడాదిన్నరలోపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి…
Congress blames Union Minister Smriti Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. స్మృతి ఇరానీ కూతురు.. గోవాలో అక్రమంగా బార్ నడుపతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఇరానీ కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని రెండో విడత విచారించనున్న తేదీని ఈ నెల 25 కాకుండా 26కు మార్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడింటారు. ఈ మేరకు సోనియాకు ఈడీ తాజా సమన్లు జారీ చేసింది.
కేసీఆరే ఇంజినీర్, డాక్టర్, మేధావి అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాస్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాత్రి మెలకువగా ఉండి ఎవర్ని కుట్రలతో మోసం చేయాలనే ఆలోచిస్తారని.. కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హతకు తగినది కాదని కేంద్రం స్పష్టం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్లు పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ నేతలకు వివరించారు.