congress hold key meeting with telangana leaders about komatireddy Rajgopal Reddy issue: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది.
రాజగోపాల్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యే.. ఆయన తో నేనని, అధిష్టానం మాట్లాడిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. సాధ్యమైనంత వరకు పార్టీలో ఉండేలా చూస్తున్నామని అన్నారు. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకోలేదు కదా..? అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడొద్దని బుజ్జగిస్తూ ఉన్నామని భట్టి స్పష్టం చేసారు. రాజగోపాల్ రెడ్డితో అధిష్టానం, మాట్లాడుతుందని, మేము మాట్లాడుతూ ఉన్నామని తెలిపారు. పార్టీ లో మీకు ఉన్న ఇబ్బందులు ఏంటని రాజగోపాల్ ను అడుగుతున్నామని అన్నారు.…
కేసీఆర్ ఢిల్లీలో.. కేటీఆర్ ఇంట్లో..! అసలు పాలన ఉందా.. రాష్ట్రంలో..? అంటూ సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎనిమిది యేండ్ల అధాయం, అప్పులు కాళేశ్వరంలో ధార పోశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. వరదకు మొత్తం మునిగిపోయిందని మండిపడ్డారు. కట్టిన వాల్స్ కూలి పోయాయని, ఎనిమిది యేండ్ల సంపదను అప్పులు, నిరుపయోగంగా మారిపోయిందని విమర్శించారు. అసలు ఏం జరుగుతుంది అనే పరిశీలనకు వెళ్తే కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. Kgf మైన్…
మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయో.. రావో.. నిర్ణయించేందుకు ఆ ప్రాంత ప్రజలే.. కానీ, మునుగోడుతో తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ముడిపడి ఉందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమైన తరుణంలో.. ఆపేందుకు కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, రాజగోపాల్‌రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గినట్టు కనిపించడంలేదు.. ఇవాళ దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయడం.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి.. ఆయనతో సమావేశమై రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని చేరవేసిన తర్వాత మీడియాతో…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్.. పరిణామాలు, ఆయన ప్రకటనలు చేస్తుంటే.. కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి.. సీఎం కేసీఆర్‌పై త్వరలో యుద్ధ ప్రకటన చేయబోతున్నాం, నేను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తే లేదు, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తాం, మునుగోడు వేదికగా ముందుకు వెళ్తా నంటూ ఆయన తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడంతో..…