పబ్లిసిటీ చెయ్యడంలో ముందుంటావు… కానీ, భారత్ జోడో యాత్రలో ఎందుకు వెనుక పడ్డావు అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్. భారత్ జోడో యాత్రపై గాంధీభవన్‌లో జరిగిన సమీక్షలో ఈ కామెంట్స్ చేశారు కేసీ వేణుగోపాల్. జోడో ప్రచారంలో తెలంగాణ పీసీసీ వెనుకబడిందని కామెంట్ చేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసే వరకు తెలంగాణ విడిచిపోవద్దని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను ఆదేశించారు.…
మునుగోడు ఉప ఎన్నికలో.. మద్యం ఏరులైపారుతోంది.. డబ్బులు పోటీపడి పంచుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే.. బేరసారాలపై వార్తలు రాగా.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. ఇది మరింత పెరిగిందట.. అయితే, డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయండి అని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మీడియా చిట్‌చాట్‌లో ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పే కుట్ర నడుస్తుందని…
TTDP not Participating in munugodu by poll. Breaking News, Latest News, Big News, Munugode By Poll, TRS, Congress, BJP, TTDP, Chandrababu, Jakkali Ilaiah,
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఖర్గేకు అధిష్ఠానంతో పాటు సోనియా సపోర్టు ఉందని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఆయన పేరును స్వయంగా సోనియానే సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కోసమే తప్ప, ఇది సామాన్య ప్రజలను ఉద్దేశించినది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రచారంలో ఎదురుపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ లెవల్లో చీకటి ఒప్పందం జరిగిందని విమర్శించారు జగ్గారెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్ వంద కోట్లు సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాయని మండిపడ్డారు.. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి అని పిలుపునిచ్చారు
ఎమ్మెల్యే సీతక్కకు ఓయూ డాక్టరేట్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. ఓయూ మాజీ ఛాన్సలర్, మణిపూర్ సెంట్రల్ వర్సిటీ ఛాన్స్లర్ ప్రొ. తిరుపతిరావు పర్యవేక్షణలో.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై పొలిటికల్ సైన్స్‌లో ఆమె పరిశోధన పూర్తి చేశారు.