తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. అయితే.. ఈ ఉప ఎన్నిక బరిలో ఉన్న నేతలు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే తాజాగా.. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక తేదీ దగ్గర పడే కొద్ది కేసీఆర్ కి నిద్ర పట్టడం లేదు. కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నడు. రాష్ట్రంలో టీఆరెయస్ పార్టీ పని అయిపోయిందని అర్థమైంది. రోజు రోజుకి సర్వే రిపోర్టులు బీజేపీకి రాజ్ గోపాల్ రెడ్డి పాజిటివ్ గా వస్తున్నాయి. మీరు ఎన్ని సర్వేలు చేసిన ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు. ప్రజాస్వామ్యం పునరుద్దరించాలంటే రాజ్ గోపాల్ రెడ్డి ని గెలిపించాలని సమాజం చూస్తుంది.
Also Read : Shabbir Ali : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతాన్ని దూషిస్తున్నారు.. ఈసీ ఫిర్యాదు చేశా
ఇది టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టడానికి కేసీఆర్ ని గద్దె దించడానికి వచ్చిన ఎన్నిక. ఇది మునుగోడు తోనే ఆగిపోదు. తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్న మూడో తారీఖున ఈ ధర్మ యుద్ధంలో పాల్గొనాలని కోరుతున్నా. కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. గొల్లకుర్మ సోదరులకు డైరెక్ట్ గా అకౌంట్లలో డబ్బులు వేశారు… నా రాజీనామా వల్ల డబ్బులు వచ్చాయి.. పేరు రాజగోపాల్ రెడ్డికి వస్తుందని అకౌంట్లు సీజ్ చేయించాడు. ఈ స్కీం తో బీజేపీకి గాని నడ్డా గారికి గాని, మోదీ గారికి గాని సంబంధం లేదు. కానీ నిన్న వారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం దుర్మార్గమైన చర్య. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మునుగోడు లో తప్ప ఎక్కడా గొర్ల స్కీం రావట్లేదు కావాలనే ఓట్ల కోసం బీజేపీ ఫ్రీజ్ చేయించ్చిందని అబద్దపు ప్రచారం చేస్తున్నారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.