తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది… అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఓవైపు, జంపింగ్‌లు మరోవైపు.. బంధుత్వాలో ఇంకోవైపు.. ఈ ఎన్నికను ఆసక్తికరంగా మారుస్తున్నాయి.. తాజాగా టి.పీసీసీ స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రంగంలోకి దిగారు.. ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడిన ఓ ఆడియో లీక్ కలకలం రేపుతోంది… తమ్ముడి తరపున ప్రచారం చేస్తున్న వెంకట్‌రెడ్డి… కాంగ్రెస్ శ్రేణులకు ఫోన్ చేసి దొరికిపోయారు.. ఆ ఆడియోలో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు రాజగోపాల్ కు ఓటేయాలని కోరారు. ఏమైనా ఉంటే తాను చూసుకుంటానని వారికి హామీ ఇవ్వడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ అవుతానని, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని.. ఇప్పుడు పార్టీలను చూడొద్దు.. రాజగోపాల్ కు ఓటు వేయాలి.. సావులు, బతుకులు, పెళ్లిళ్లు, పిల్లలు.. ఇలా ప్రతీదానికి రాజగోపాల్‌రెడ్డి సాయం చేస్తూ ఉంటారని ఆ ఆడియోలో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..
Read Also: High Court: అమరావతి రైతుల పాదయాత్ర.. హైకోర్టు కీలక ఆదేశాలు
వచ్చే మార్చిలో నేనే పీసీసీ అధ్యక్షుడిని అవుతా.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని.. కాంగ్రెస్ నేత జబ్బార్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన ఆడియో.. ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. అంటే.. ఒకే దెబ్బతో రెండు పిట్టలను కొట్టాలనే ప్లాన్‌లో ఎంపీ కోమటిరెడ్డి ఉన్నారని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి.. తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించడం.. ఆ తర్వాత పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్‌రెడ్డిని దించడం.. తాను పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కించుకోవడమే ఆయన స్కెచ్‌గా అభివర్ణిస్తున్నారు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయకుండా మునుగోడుకు దూరంగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి… విదేశీ పర్యటనకు కూడా సిద్ధం అయ్యారు.. ఈ సమయంలో.. ఆయన ఆడియో లీక్ కావడం.. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది…