Komatireddy Venkat Reddy Viral Video: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు… నిన్న ఆడియో లీక్.. నేడు వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది… పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ.. విమర్శలు, ఆరోపణల పర్వం ఓవైపు.. ప్రచారం, లీక్‌ల పర్వం మరోవైపు సాగుతోంది.. నిన్నటికి నిన్న.. పార్టీని చూడకుండా తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో ఒకటి వైరల్‌గా మారిపోయింది… చావు, బతు, చెడు, మంచి, పెళ్లి, పిల్లలు.. ఇలా అన్నింటికీ తన సోదరుడు సాయం చేస్తూ ఉంటాడు.. పార్టీలకు అతీతంగా ఓటు వేయాలని కోరిన ఆయన.. ఈ దెబ్బతో నేను పీసీసీ చీఫ్‌ను అవుతాను.. మార్చిలో పీసీసీ అధ్యక్షుడిని అవుతా.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.. ఇది పెద్ద రచ్చగా మారిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆయన.. మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే.. నిన్న కోమటిరెడ్డి ఆడియో లీక్ అయ్యి వైరల్‌గా మారితే.. ఇవాళ వీడియో వైరల్ అవుతోంది..
Read Also: T20 Cricket : భారత్ – పాక్ మ్యాచ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.. ఇక, మెల్‌బోర్న్‌లో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అభిమానులతో ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అని తేల్చేశారు కోమటిరెడ్డి.. నేను వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినా పదివేల ఓట్లు వస్తాయి.. తప్ప గెలవబోమన్నారు.. దానికి కారణం కూడా చెప్పారు కోమటిరెడ్డి.. రెండు అధికార పార్టీలు (టీఆర్ఎస్-బీజేపీ) కొట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అని ప్రశ్నించారు. డబ్బులు కాంగ్రెస్ పెట్టలేదు అన్నారు.. నేను 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశా.. ఎంపీగా కొనసాగుతున్నాను.. చాలు ఇక విశ్రాంతి తీసుకుంటానన్నారు.. రాష్ట్రంలో పాదయాత్ర చేద్దామనుకున్నా.. కానీ, కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు అని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను వెళ్లి ప్రచారం చేసినా ఓడిపోయేదే… ఓడిపోయే సీటుకు ప్రచారం చేసేది ఎందుకు..? అని ఎదురు ప్రశ్నించారు.. అంతేకాదు, నేను మునుగోడుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పలేనని కుండబద్దలు కొట్టేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..