మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నేతలు. అయితే.. ఈ నేపథ్యంలో మునుగోడు ప్రచారంలో ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతాన్ని దూషిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అని కిషన్ రెడ్డి చెప్తున్నారని, ఈ విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశామన్నారు. మత విద్వేషాలు పుట్టించి లబ్ది చెందాలని చూస్తున్నారని, రిజర్వేషన్లు తీయడం కిషన్ రెడ్డి తరం కాదని, జడ్జి పాత్ర కూడా కిషన్ రెడ్డి నే పోషిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఎవరి రిజర్వేషన్ గుంజుకొని ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు లో కూడా కేంద్రమంత్రి పై కేసు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read : Komatireddy Rajgopal Reddy : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్‌పై స్పందించిన రాజగోపాల్ రెడ్డి..
కోర్టు వ్యవహారాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కేసు వేస్తానని, పిచ్చోడు చేతిలో రాయిలా కిషన్ రెడ్డి చేతిలో మంత్రి పదవి అలాగే ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. మతం పేరుతో ఎన్నికల ప్రచారం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. వెంకట్ రెడ్డి ఆడియో ఇప్పుడే చూశానన్న షబ్బీర్ అలీ.. సీనియర్ ల సమావేశం లో చర్చ చేస్తామన్నారు. ఠాగూర్ కూడా సమావేశం లో ఉంటారు కాబట్టి.. చర్చ చేస్తామని, రాహుల్ గాంధీ కి హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ వంటకాలు కూడా రుచి చూపిస్తామన్నారు. ఇదిలా ఉంటే.. కాసేపట్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు. ఠాగూర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. అయితే.. ఈ సమావేశంలో.. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ పాదయాత్ర పై చర్చించనున్నారు. అంతేకాకుండా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో వ్యవహారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.