ఇవాళ 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున నామినేషన్ పత్రాలను సమర్పించారు..
కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. రేపు సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు.
ఈనెల 15వ తేదీని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దాదాపు 20 రోజుల పాటు ఆయన కుటుంబంతో అక్కడే ఉంటారు. మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికల పోటీలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్లు ఇద్దరే ఉన్నట్లు ఆయన తెలిపారు.