Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బీజేపీపై వంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘‘ నాటు నాటు’’ పాటకు ‘‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ డాక్యుమెంటరీలకు ఆస్కార్ అవార్డులు రావడాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మేము చాలా గర్వంగా ఉన్నాము.. అయితే నా ఏకైక అభ్యర్థన ఏంటంటే బీజేపీ ఈ అవార్డులు తన ఘనత అని చెప్పుకోవద్దని ఖర్గే అన్నారు.
RSS: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ హోసబాలే అన్నారు. స్వలింగ వివాహాలపై కేంద్రం దృష్టితో తాము ఏకీభవిస్తున్నామని, ఆడ, మగ వారి మధ్యే వివాహం జరుగుతుందని హోసబాలే అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఏఐసీసీ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి.. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణిరావు ఠాక్రేకు లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Errabelli Dayakar Rao: రాజకీయాల్లో నంబర్ వన్ ఎవరు.. ఆ తర్వత ఎవరు? అనే చర్చ సాగుతూనే ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో అది వివాదాలకు కూడా దారి తీస్తుంది.. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత నంబర్ ఎవరిది? అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది.. రెండు మూడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.. అయితే, అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ తర్వాత నేనే నంబర్ వన్ అంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రభుత్వ…
రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. టి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ చేపట్టనున్నారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.