Arvind Kejriwal: ‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఈ రోజు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్షను విధించింది. ఆ తరువాత 30 రోజలు పాటు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఈ కేసుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కుట్రతో బీజేపీ నాయకులు విపక్షాలను భయపెడుతోందని, గుజరాత్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని ఆయన అన్నారు. మాకు, కాంగ్రెస్ పార్టీకి విభేదాలు ఉన్నాయి, అయినా కూడా ఇలా రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం సరికాదు అని ట్వీట్ చేశారు. ప్రశ్నించడమే ప్రతిపక్షాల పని, మేము కోర్టును గౌరవిస్తాం, కానీ నిర్ణయంతో విభేధిస్తాము అని వ్యాఖ్యానించారు.
Read Also: Revanth Reddy: రాహుల్ కి రెండేళ్ల జైలు శిక్ష.. షాక్ లో ఉన్నానన్న రేవంత్ రెడ్డి
2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘‘ఈ దొంగలందరికి మోదీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుంది??’’ అని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా కింద కేసు పెట్టారు. తాజాగా నాలుగేళ్ల తరువాత ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువడిని తర్వాత మహాత్మా గాంధీని ఉటంకిస్తూ.. ‘‘ నా మతం సత్యం, అహింసాలపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు, అహింసే దానిని పొందే సాధనం’’ అని రాహుల్ అన్నారు.