సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కుమ్మరి తండాకు చేరుకుంది. టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీని నిరసిస్తూ ఓయూ జేఏసీ, ఎన్ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ప్రశ్నాపత్రం లీకేజీపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను కేసీఆర్ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్ బోర్డు నియామకం చేసిన ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు.
Also Read : Payyavula Keshav: ఎమ్మెల్సీ ఫలితాలతో మా బాధ్యత పెరిగింది
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కల్లోలితంగా చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించాలి లేకుంటే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సమయత్తం చేస్తాం.. ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఉద్యమం చేపడుతామని భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో ఉందని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికే తమ పాదయాత్ర అంటూ భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read : Bhuma AkhilaPriya : ఆళ్లగడ్డ అసలు ప్రభుత్వం దృష్టిలో ఉందా.. లేదా?
TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ కి బాధ్యులైన వారు తమ పదవులకు రాజీనామా చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ధరణి వల్ల ఎక్కువగా పేద రైతులే నష్ట పోయారన్నారు. ఒకప్పుడు భూములను వదిలేసి వెళ్లిన వారందరికీ లబ్ది చేకూర్చిందన్నారు. కేసీఆర్ తీరు, ధరణి వెబ్ సైట్ వల్ల రాష్ట్రంలో తిరిగి ప్యూడలిజం వచ్చిందని భట్టి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. కాస్తు సహా ఇతర కాలమ్స్ ను పొందు పరుస్తామన్నారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని భట్టి విక్రమార్క అన్నారు.