టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నోటిఫికేషన్ లు వేస్తామని ఆయన అన్నారు.
డివిజనల్ హెడ్క్వార్టర్కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్క్వార్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదని, కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే తప్ప ప్రజాస్వామ్యానికి కాదన్నారు.
Mamata Banerjee-Akhilesh Yadav New Front Without Congress: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు తమ ఎన్నికల ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ చీఫ్ మమతా బెనర్జీని కోల్కతాలో కలిశారు. ఇరువురు నేతల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న…
Mallikarjun Kharge: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
లండన్లో ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. వయనాడ్ ఎంపీ విదేశీ గడ్డపై దేశాన్ని పరువు తీశారని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. రెండవ రోజు ఇచ్చోడ నైట్ హాల్ట్ పాయింట్ నుంచి పీపుల్స్ మార్చ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి రోజు పిప్పిరి నుంచి ఇచ్చోడ వరకు యాత్ర కొనసాగింది. నేడు సిరికొండలో సాయంత్రం కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడనున్నారు.
లండన్ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్ ప్రసంగంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి.
Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. ఆయన్ను ఓడించేందుకు అధికారపార్టీ కొడంగల్లో సర్వ శక్తులు ఒడ్డి సక్సెస్ అయ్యింది. తర్వాత మల్కాజ్గిరి లోక్సభకు పోటీ చేసిన రేవంత్ ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి రేవంత్ కొడంగల్ వదిలేశారనే ప్రచారం జరిగింది. నియోజకవర్గాన్ని తన సోదరుడు తిరుపతిరెడ్డికి అప్పగించారు రేవంత్. దాంతో తిరుపతిరెడ్డే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఇటీవల కొడంగల్కు రేవంత్…