Jairam Ramesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం స్థానికతకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. నాలుగు ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కర్ణాటక ప్రజలకు విటమిన్-పి కావాలని ఆయన అన్నారు.
PM Modi: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శక్తివంచన లేకుండా అధికారం కోసం ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం కోలార్ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. కోలార్ లో జరిగిన సభ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటక అభివృద్ధికి అవరోధంగా తయారయ్యాయన్నారు. ప్రజలు వాటిని క్లీన్ బౌల్డ్ చేశారని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి…
కాంగ్రెస్ లో రాజకీయ నిరుద్యోగులు నల్గొండలో నిరుద్యోగ దీక్షకు వచ్చారు అని నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అంతా ఒకటే అన్నారు, కానీ వేరు వేరుగా వచ్చారు.. మంత్రి గురించి అలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని భూపాల్ రెడ్ది ఎద్దేవా చేశారు.
Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వేగం పెంచారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. విపక్ష పార్టీ ఇప్పటివరకు తనను 91 సార్లు దూషించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అలా చేసిన ప్రతీసారి ఆ పార్టీ కుప్పకూలిపోయిందని విమర్శించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఒకవైపు అధికార బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడుతోంది.
తనను "రావణ్" అని పిలిచినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఎదురుదాడికి దిగారు. సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెకావత్ ప్రమేయాన్ని గెహ్లాట్ ప్రస్తావిస్తూ, “నేను రావణుడినైతే, నువ్వు రాముడివి అయ్యి, పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి ఇవ్వు” అని అన్నారు.
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కన్నడ సినీ స్టార్ శివరాజ్‌కుమార్ సతీమణి గీతా శివ రాజ్‌కుమార్ జేడీఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.
Off The Record: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొందరు సీనియర్ నాయకుల అడుగులు చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా మంది నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకుల అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల మీటింగ్‌పై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్…