The Kerala Story: ‘‘ ది కేరళ స్టోరీ’’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని ఆపాలంటూ పలువురు సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు పలు ముస్లిం సంఘాలు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలా వ్యతిరేకతకు కారణం ఏమిటని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
Sharad Pawar: ఎన్సీపీ నాయకుడు, సీనియర్ నేత శరద్ పవార్ తన ఆత్మకథలో సంచలన విషయాలను వెల్లడించారు. తన మరాఠీ ఆత్మకథ ‘లోక్ మాజే సంగతి’(ప్రజలు నాకు తోడుగా ఉన్నారు) పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ కేంద్రబిందువు అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని శరద్ పవార్ వెల్లడించారు. ఇతర పార్టీలతో వ్యవహరిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా జాతీయ పార్టీగా తన స్థాయిని గుర్తు తెచ్చుకుంటుదని…
Bajrang Dal: కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో వస్తే హిందూ సంస్థ ‘భజరంగ్ దళ్’ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ప్రకటించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఈ హామీపై బీజేపీతొో పాటు పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఇండియా(పీఎఫ్ఐ)తో భజరంగ్ దళ్ ను పోలుస్తూ కాంగ్రెస్ ఈ హామీ ఇవ్వడంపై భజరంగ్ దళ్ మాతృసంస్థ విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎన్నికల వాగ్ధానాన్ని సవాల్ గా…
Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్రమోదీ, జేపీనడ్డా, అమిత్ షాలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మంగళవారం తీర్థహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
DK Shivakumar: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ను పైలెట్ చాకచక్యంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం నుంచి డీకే శివకుమార్ తప్పించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ కూడా హెలికాప్టర్ లో ఉన్నారు.
రాహుల్ గాంధీ అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానని శివరాజ్ కుమార్ చెప్పారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని.. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని శివరాజ్ కుమార్ అన్నాడు.
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్, మహిళలకు నగదు-ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.