PM Modi: ఏ ముహూర్తాన ది కేరళ స్టోరీ టీజర్ రిలీజ్ చేశారో కానీ, అప్పటినుంచి ఆ సినిమా చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కేరళలో కనిపించకుండా పోయిన 32 వేలమంది యువతుల కథగా బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి.. వివాదాన్ని మరింత పెంచింది. కేరళలో విద్వేషాలు రగల్చడానికే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వివాదంపై పీఎం మోడీ సైతం స్పందించారు. ఈ సినిమా తీవ్రవాదుల కుట్రను, చేదు నిజాలను చూపించారని అన్నారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించి, నిజానిజాలు తెలుసుకోవాలని తెలిపారు.
Prasanth Varma: ‘హను-మాన్’ వాయిదా, త్వరలో కొత్త విడుదల తేదీ!
“కొన్నిరోజులుగా నేను కూడా చూస్తున్నాను. ది కేరళ స్టోరీ సినిమాపై పెద్ద చర్చనే జరుగుతుంది. కేరళలో ఉన్న కొన్ని ఉగ్ర శక్తుల గురించి ఈ సినిమాలో చూపించారు.వారు చేసిన అక్రమాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా ఉగ్రవాదం గురించి తెలియజేసింది.. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్.. ఆ ఉగ్ర శక్తులకు సపోర్ట్ ఇస్తోంది. ఉగ్రశక్తులతో కాంగ్రెస్ ఒప్పుందం చేసుకుంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ తో జాగ్రత్తగా ఉండాలి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే అందుకుంది. థియేటర్ వద్ద గొడవలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. మరి రికార్డులు, కలెక్షన్స్ ఈ సినిమాకు ఎలా వస్తాయో చూడాలి.