Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలబురిగిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రధాని మోదీ ‘‘విషపు పాము’’అని, ఇది నిజమా కాదా..? అని తేలుసుకోవాలంటే ఒక్కసారి ముట్టుకోవాలని,
PM Modi: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో బూత్ స్ఠాయిలో ప్రచారాన్ని పటిష్టం చేయాలని, మెజారిటీతో గెలుపొందాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ పార్టీ వారంటీ గడువు ముగిసిందని, ఆ పార్టీ ఇచ్చే హామీలకు అర్థం లేదని అన్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాన్ని…
కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ భగ్గుమంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరును పెంచాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఆమె సందడి చేశారు.