నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో మాజీ సీఎల్పి నేత జానారెడ్డి పాల్గొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను, నిరుద్యోగులను చూస్తుంటే మా హృదయాలు పరవశిస్తున్నాయని ఆయన అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు ప్రెస్ మీట్ పెట్టారు. జీవన్ రెడ్డి దళిత బంధు పథకంపై మతిబ్రమించి, సంస్కరహీనంగా మాట్లాడారు అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు జీవన్ రెడ్డికి మెదడు లేదు అంటూ విమర్శించారు.
Amit Shah: కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలబురిగి సభలో ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు ప్రచారాన్ని రసవత్తంగా మార్చాయి. మోడీ ‘విష సర్పం’ అంటూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది.
కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోని ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 84 నుంచి 119కి పెంచాలని హస్తం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధిష్టానం ఏఐసీసీ కార్యదర్శులకు ఆదేశించింది.
గతేడాది భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోకి ప్రవేశించబోతున్న సందర్భంలో రాహుల్ గాంధీకి ఓ బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇండోర్లోకి ప్రవేశించిన వెంటనే ఆయనపై బాంబ్ వేస్తానని బెదిరిస్తూ రాసిన లేఖ అదే నగరంలోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా లభించింది.
Off The Record: చాలా రోజుల నుంచి మౌనంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి… నా మనసులో ఆవేదన ఉందంటూ తాజాగా ప్రకటనలు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద తూటాలు ఎక్కుపెట్టారా అన్న అనుమానాలు మొదలయ్యాయట. ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు నాయకులందర్నీ పిలిచి రేవంత్ మాత్రం వదిలేశారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి తన మనసులో ఉన్న విషయాలను వరుసగా ప్రకటనల రూపంలో విడుదల…
Karnataka Elections: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కొంపముంచబోతున్నాయా..? అంటే బీజేపీ ఆ విధంగానే సింపతి సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. గత అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు. తాజాగా ఈ రోజు కలబురిగిలో జరిగిన ఓ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ విషపు పాము లాంటి వాడని, బీజేపీ పార్టీ కూడా అటువంటిదే అని వ్యాఖ్యానించాడు. అతను విషపు పామా..? కదా..?…