తెలంగాణ కోసం అందరూ పోరాటం చేశారు అని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే అన్నారు. సోనియాగాంధీ తెలంగాణకి స్వాతంత్రం ఇచ్చారు.. కేసీఆర్ పార్టీ బలం ఎంత అప్పుడు.. సోనియా వల్లనే తెలంగాణ వచ్చింది.. ఒక్క వ్యక్తి ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకుంటున్నారు అని ఆయన అన్నారు.
దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఉదయం ముగ్గురు మంత్రులను తన కేబినెట్ లో చేర్చుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధీకి కేబినెట్ లో చోటు కల్పించారు.
ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ని సందర్శించి 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ ఒక ప్రదేశం మాత్రమే కాదన్న రాహుల్‌గాంధీ.. ఇది పరాక్రమమని అభివర్ణించారు.