రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య హాజరు కానునట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. గడిచిన 9 సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ రేటును పెంచుతూ పోయిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చే సరికి గ్యాస్ సిలిండర్ రేటును 200 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదమని వీహెచ్ అన్నారు. తాను కూడా బీసీనే అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ.. బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు.
Read Also: Paper Cups: పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగుతున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె ఆగిపోతుంది..
అయితే, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని రోజులుగా వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ పై ఆయన పదే పదే చర్చించారు. ఏఐసీసీపై ఒత్తిడి తీసుకువచ్చి.. తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తుందో తెలియజేయాలని వీహెచ్ పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రైతు డిక్లరేషన్, యువత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లను ప్రకటించింది. ఇందులో భాగంగానే బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేస్తున్నాట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే.. బీసీలకు తగిన న్యాయం చేయడంతో పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని రెండు బీసీ ఎమ్మెల్యే అభ్యర్థులకు అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Read Also: China New Map: అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలపై చైనా వాదన కొత్తేమీ కాదు.. కేంద్రంపై కపిల్ సిబల్ ఫైర్