బీసీ డిక్లరేషన్ పై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ వేసింది. బీసీ డిక్లరేషన్ పై పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ చూసుకుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపుగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే నేడు ( బుధవారం ) పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో ఆరుగురిని కో చైర్మెన్లుగా ఎంపిక చేసింది. ఈ కమిటీకి మరో 9 మంది అడ్వైజరీలను కూడా నియమించింది.
Read Also: Pew Research Survey: 80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
ఇప్పటికే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్లను ప్రకటించింది. ఈ నెల 29న మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.. కానీ కొన్ని కారణాలతో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటనను వాయిదా వేసింది. ప్రకటించాల్సిన మిగిలిన డిక్లరేషన్లపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇదిలా ఉంటే మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలు, బీసీలకు సీట్ల కేటాయింపు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: అదిరా పవన్ రేంజ్.. పాకిస్థాన్ లో కూడా ‘బ్రో’ దే రచ్చ
బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై ఎంపీ ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు పలు సూచనలు చేశారు. కృష్ణయ్య చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పొన్నాల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఈ మేరకు అభ్యర్థులను కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ప్రకటించలని చూస్తుంది. ఈ మేరకు నిన్ననే( మంగళవారం ) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్ లో అభ్యర్థుల తొలి జాబితాను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది.