INDIA Alliance: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు, ప్రధాని మోడీని గద్దె దించేందుకు ఇండియా కూటమి సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, శివసేన(ఉద్ధవ్), ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం వంటి మొత్తం 28 పార్టీలో ఇండియా కూటమి జట్టు కట్టాయి. ఈ కూటమిని మూడో విడత సమావేశం ముంబైలో జరుగుతోంది. నిన్న, ఈ రోజు సమావేశాల్లో ఏజెండా, జెండా, సీట్ల పంపకాలు తదితర అంశాలపై నేతలు చర్చించారు. అంతకు ముందు పాట్నాలో కూటమి మొదటి సమావేశం జరగగా, బెంగళూర్ లో రెండో సమావేశం జరిగింది.
ముంబైలో రెండో రోజు జరుగుతున్న ఈ మీటింగ్ లో ఇండియా కూటమి ‘లోగో’ ఆవిష్కరించనున్నారు. కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ప్రచార వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. సీట్ల సర్దుబాలుపై ఈ నెల 30న నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Read Also: T Congress: హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తేదీ మారే ఛాన్స్
సమన్వయ కమిటీ కోసం కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే భాగస్వామ్య పార్టీల నుంచి ఒకరి పేరు ఇవ్వాల్సిందిగా కోరారు. కూటమి కన్వీనర్, అధికార ప్రతినిధులను ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ 2 నాటిక కూటమి మానిఫెస్టో విడుదల చేయాలని మమతా బెనర్జీ కోరారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కామన్ ఎజెండా ఉండాలని ఖర్గే అభిప్రాయపడ్డారు.
శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు బీజేపేతర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్, హేమంత్ సొరెన్ వంటి వారితో పాటు సీనియర్ నేత శరద్ పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.