జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ మాకు ఒక విధానం ఉందని. కేసీఆర్ పార్టీలగా నియంతృత్వ పార్టీ కాదు అని విమర్శించారు.
భూములను అమ్ముకోవడాని కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని.. ఆ పార్టీని భూస్థాపితం చేద్దామని అన్నారు.
సుమారు మూడున్నర నెలలకు పైగా మణిపూర్లో హింస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్లో హింసను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు.
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను పోటీ చేయాలని ఎవరు కోరలేదు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు అలా చెప్పడం సిగ్గు చేటు అంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గజ్వేల్ లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ కేన్సర్ లాంటోడు... మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు అని విమర్శించాడు.
కాంగ్రెస్ పార్టీలో జనగామ కాంగ్రెస్ విధేయుల లేఖ కలకలం రేపుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. జనగామ డీసీసీ అధ్యక్షుడి నియామకంలో టీపీసీసీ అధ్యక్షుడు.. ఏఐసీసీ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆ లేఖలో జనగామ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడు అని విమర్శలు గుప్పించాడు.
కేసీఆర్ వల్లే తెలంగాణ రాజకీయాలు డబ్బు చుట్టు తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రెండు టర్ములల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు అరాచకంగా సంపాదించారు అని ఆయన విమర్శించారు.