నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ఎక్స్ అఫీషియో, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు హాజరుకానున్నారు. అయితే నేటి కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ సమావేశం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో నేటి నుంచి పది రోజుల పాటు ఊరువాడ ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మహిళా శక్తి విజయాలను పురస్కరించుకొని సంబరాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొత్త సభ్యులను చేర్పించేలా అన్ని స్థాయిల్లో కళా జాతాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా బ్యాంకు రుణాలు, మహిళా సంఘాలకు వడ్డీలు, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కుల పంపిణీ చేయనున్నారు. Also Read:Bihar: పాట్నాలో దారుణం..…
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని భావించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మొదట్లో బుజ్జగించారు. ఆ తర్వాత అగ్రనాయకత్వంతో మాట్లాడించాలని నిర్ణయించింది పార్టీ. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే... అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాలని టార్గెట్ ఫిక్స్ చేసిందట అధిష్టానం. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది.
అధికారులను పంపించి ముగ్గు వేయించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు ఎలా క్యాన్సల్ చేస్తారని ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన శ్రీరాములపేటలో ఇప్పటి వరకు ఎందుకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వలేదని అడిగారు. దళిత బంధు వచ్చిన దళితులకు ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఇవ్వరు.. ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు వచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని చెప్పారా సమాధానం ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Rahul Gandhi: బీహార్లో మహిళలకు పంపిణీ చేయాలనుకుంటున్న ఉచిత ‘‘శానిటరీ ప్యాడ్స్’’పై రాహుల్ గాంధీ బొమ్మ ఉండటంపై కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడింది. మహిళల కోసం ఇచ్చే ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ముఖం ఎందుకు ఉందని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మహిళలకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో కాంగ్రెస్ ‘‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’’ కింద ఈ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నారు.
Telangana CM: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయం సమరభేరి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధ పడకండి.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు.
CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.
Kharge Slams BJP: పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించింది.. కానీ, బీహార్ ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. నరేంద్ర మోడీకి దేశ భద్రతపై లేదని విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా అందరూ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. తెలంగాణలో కులగణన.. దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు.