ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. “కవిత అరెస్ట్ తర్వాత నువ్వే నా ఇంటికి వచ్చావు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని అప్పుడే చెప్పావు. కవితను విడుదల చేస్తే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానని నువ్వు చెప్పిన విషయం మరిచిపోయావా?” అని ప్రశ్నించారు. అలాగే, “నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. కేవలం 300 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం నీకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా సంస్కారం అడ్డువస్తోంది” అని సీఎం రమేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ కాలేదు.
Also Read:UP: ప్రియురాలి కోసం అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ.. స్థానికులు ఏం చేశారంటే..!
ఈ క్రమంలో కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై కేటీఆర్ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు..? సీఎం రమేష్ ఇంటికి వెళ్ళలేదు, బిజేపితో కుమ్మక్కు కాలేదు అని ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీకి, మా పార్టీకి ఒక శాతం ఓట్ల తేడా మాత్రమే అని కేటీఆర్ అన్నారు.. మరి లోక్ సభ ఎన్నికల్లో మీరు మీ పార్టీ బీజేపికి ఓట్లు వేయించింది నిజమా..?కాదా..? ఈ ప్రశ్నలకు కేటీఆర్ గుండెపై చేయి వేసుకుని సమాధానం చెప్పాలి.. కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతారనేది ఎంపీ రమేష్ మాటల్లో చూశాం.. ఎన్ని అబద్ధాలు చెప్పినా.. కొద్దీ రోజుల్లో నిజం తెలుస్తుందని మంత్రి సీతక్క వెల్లడించారు.